Bengaluru: బెంగళూరులో తాగునీటి వాడకంపై కఠిన ఆంక్షలు

by Shamantha N |

వేసవి సమీపిస్తుండటంతో నీటి ఎద్దడి లేకుండా బెంగళూరు అధికారులు చర్యలు చేప్టటారు. భూగర్భ జలాలు క్షీణిస్తుండటంతో బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (BWSSB) తాగునీటి వాడకంపై కఠినమైన ఆంక్షలు విధించింది.

Bengaluru: బెంగళూరులో తాగునీటి వాడకంపై కఠిన ఆంక్షలు
X

దిశ, నేషనల్ బ్యూరో: వేసవి సమీపిస్తుండటంతో నీటి ఎద్దడి లేకుండా బెంగళూరు అధికారులు చర్యలు చేప్టటారు. భూగర్భ జలాలు క్షీణిస్తుండటంతో బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (BWSSB) తాగునీటి వాడకంపై కఠినమైన ఆంక్షలు విధించింది. అనవసర కార్యకలాపాలకు తాగునీటిని వాడొద్దని పేర్కొంది. బీడబ్ల్యూఎస్ఎస్బీ ఛైర్మన్ డాక్టర్ రామ్ ప్రసాద్ మనోహర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాలను కడగడం, తోటపని, నిర్మాణం, డెకరేటివ్ ఫౌంటెన్లు, రోడ్లను శుభ్రపరచడం సహా ఇతర అనవసర కార్యకలాపాలకు తాగునీటిని వాడవద్దని సూచించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. 5 వేలు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. పదేపదే ఉల్లంఘనలకు అదనపు జరిమానాలు విధిస్తామన్నారు. నిరంతరం నిబంధనలు ఉల్లంఘిస్తే రోజుకు రూ.500 జరిమానా విధిస్తామన్నారు. బెంగళూరు నగరంలో ముంచుకొస్తున్న నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఈ చర్య అవసరమని అధికారులు చెబుతున్నారు.

భూగర్భ జలాలు తగ్గడంతోనే..

భూగర్భజలాలు తగ్గడం, తగినంత వర్షపాతం లేకపోవడం వల్ల రాబోయే నెలల్లో బెంగళూరులో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) శాస్త్రవేత్తల నివేదికలు చెబుతున్నాయి. దీంతో బెంగళూరు మున్సిపాలిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే 1916 నంబర్‌ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.

Next Story