- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై బెంగాల్ భయపడాల్సిన అవసరం లేదు: PM మోడీ
by velandi.Saikiran |
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై పశ్చిమ బెంగాల్ భయపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఆ రాష్ట్రంలో TMC అధికారం కోల్పోయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. పశ్చిమ బెంగాల్లో భయాందోళనలకు విముక్తి కలిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ గెలుపు ప్రతీకారం కాదని... ఇది మార్పునకు సంకేతం అంటూ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో తొలిసారి భయానికి బదులు ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. అంగ, వంగ, కళింగ ప్రాంతాల ప్రజలు బీజేపీ పార్టీని ఎన్నుకున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు. ఇక ఇతర రాష్ట్రాల్లోనూ భారీ పోలింగ్ నమోదు కావడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.
Next Story






