మాజీ మంత్రి లైంగిక వేధింపు కేసు: మహిళా కోచ్ సంచలన ఆరోపణలు

by Hajipasha |
మాజీ మంత్రి లైంగిక వేధింపు కేసు: మహిళా కోచ్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా క్రీడల మాజీ మంత్రి సందీప్ సింగ్ మహిళా కోచ్‌ను లైంగిక వేధింపులకు గురిచేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే మహిళా కోచ్ సంచలన ఆరోపణలు చేశారు. చండీగఢ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట మాట్లాడుతూ.. తనకు కోటి రూపాయలు ఆఫర్ చేశారని, దేశం విడిచి వెళ్లాలని తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని వ్యాఖ్యనించారు. ఈ కేసులో హర్యానా పోలీసులు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. 'నేను చండీగఢ్ పోలీస్ సిట్‌కి అన్నీ వివరంగా చెప్పాను. పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా సిట్‌కి చెప్పాను. ముఖ్యమంత్రి ప్రకటన విన్నాను. ఆయన కూడా సందీప్ సింగ్‌ వైపే ఉన్నారు. చండీగఢ్ పోలీసులు నాపై ఎలాంటి ఒత్తిడి చేయలేదు. కానీ, హర్యానా పోలీసులు నాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు' అని ఆరోపించారు. తనకు దేశం విడిచి వేళ్తే రూ.కోటి రూపాయలు ఆఫర్ చేశారని కాల్స్ వస్తున్నాయన్నారు.

మరోవైపు చండీగఢ్ పోలీసులు మాజీ మంత్రిని అరెస్టు చేయలేదని, పోలీసులు విచారించలేదని కోచ్ తరపు న్యాయవాది దీపాంశు బన్సాల్ చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం అంతా చండీగఢ్‌కి సంబంధిందని, చండీగఢ్ పోలీసులు సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారని అన్నారు. ఆ తర్వాత స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడానికి పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నామని తెలిపారు. 8 గంటల పాటు విచారణ జరగగా.. తమ క్లయింట్ వద్ద ఉన్న రికార్డులను, ఫోన్‌ను పోలీసుల ముందు సమర్పించామని తెలిపారు. పోలీసులు సందీప్ సింగ్‌ను విచారించడం గానీ అరెస్టు గానీ చేయలేదన్నారు.

Also Read...

పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..ఎందుకో తెలుసా?


Next Story

Most Viewed