- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒరాకిల్ ఊచకోత మరువకముందే అమెజాన్‍లో భారీగా లేఆఫ్‍లు!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. వచ్చే నెలలోవేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ ఐటీ దిగ్గజం ఒరాకిల్ (Oracle) లో ప్రపంచ వ్యాప్తంగా 30 వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన ఘటన మరువక ముందే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ (amazon) ఉద్యోగులపై పెద్ద ఎత్తున్న వేటు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏకంగా 14 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆసియా బిజినెస్ అవుట్ లుక్ ప్రకారం వచ్చే నెలలో ఈ లేఆఫ్‍లు ఉండబోతున్నాయి. అమెజన్ వెబ్ సర్వీసెస్, రిటైల్, హెచ్ఆర్ విభాగాల్లోని ఉద్యోగులపై వేటు పడబోతుందని తెలుస్తోంది. అయితే ఈ లేఆఫ్‍ల పై అమెజాన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా 2025లో 14 వేల మందిని, ఈ 2026 ప్రారంభంలోనే మరో 16 వేల మందిని అమెజాన్ తొలగించింది. ఓ వైపు మెక్రోసాప్ట్, టీసీఎల్, యాక్సెంచర్, ఒరాకిల్ వంటి దిగ్గజ సంస్థలు వరుసగా ఉద్యోగులను తొలగిస్తుండగా అదే బాటలో అమెజాన్ సైతం వెళ్తుండటంతో తమ బతుకులు ఎప్పుడు రోడ్డున పడతాయో అనే ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా ఆయా సంస్థలలోని ఉద్యోగుల్లో వ్యక్తం అవుతోంది.






