- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వచ్ఛంద సెక్స్ వర్కర్‌గా మారడం నేరం కాదు.. సుప్రీంకోర్టు సెన్సేషనల్ కామెంట్స్
మహిళలు, మైనర్ల అక్రమ రవాణాను అరికట్టేందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా యువతుల అక్రమ రవాణా (Human Trafficking), లైంగిక దోపిడీని పూర్తిగా అరికట్టేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) అత్యంత కీలకమైన, చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ అరాచకాలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలో స్పష్టం చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్రమైన మార్గదర్శకాలను (Comprehensive Guidelines) జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ హ్యుమన్ ట్రాఫికింగ్‌పై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్ ద్విసభ్య ధర్మాసనం విచారించింది.. దేశంలో మహిళల రక్షణ, మానవ హక్కుల పక్షణ దిశగా ఇచ్చిన తీర్పు ఓ మైలురాయిగా నిలిచిపోనుంది.
కేసు విచారణ సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం.. హ్యుమన్ ట్రాఫికింగ్ అనేది క్షమించరాని నేరమని కామెంట్ చేసింది. ముఖ్యంగా మహిళలు, మైనర్లను అక్రమ రవాణా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్వచ్ఛంద లైంగిక వృత్తి, బలవంతకు అక్రమ రవాణ మధ్య తేడాను స్పష్టంగా గుర్తించాలని కొని సూచనలు చేసింది. అయితే, స్వచ్ఛంద సెక్స్ వర్కర్‌గా మారడం నేరం కాదని, వారిని ఏవిధంగాను వేధించవద్దని తెలిపింది. వారిపై దాడులు చేయడం, క్రిమినల్ కేసులు పెట్టడం చట్టవిరుద్ధమని పేర్కొంది. కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్‌తో లైంగికంగా దోపిడీ పాల్పడటం శిక్షార్హమని కోర్టు కామెంట్ చేసింది. దేశంలో ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కు ఉందని, రెస్క్యూ ఆపరేషన్‌లో మహిళలు, మైనర్ల ఫోటోలు, వీడియోలను మీడియాలో ప్రసారం చేయడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తాం.. జాగ్రత్త అంటూ సుప్రీం ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.






