Maharashtra: మరోసారి ‘మహా’పాలిటిక్స్ లో సంచలనం.. అధికార కూటమిలో బీటలు!

by Prasad Jukanti |   (  Updated:2025-12-14 13:56:16  IST  )

మహారాష్ట్ర రాజకీయం మరోసారి చర్చనీయాశంగా మారింది.

Maharashtra: మరోసారి ‘మహా’పాలిటిక్స్ లో సంచలనం.. అధికార కూటమిలో బీటలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర రాజకీయం మరోసారి చర్చనీయాశంగా మారింది. గతేడాది జరిగిన ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అంచనాలను మించి మహాయుతి కూటమి తిరుగులేని విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) కూటమికి ప్రజలు పట్టం కట్టారు. అధికారం చేపట్టి ఏడాది తిరగకముందే ఈ కూటమిలో లుకలుకలు ఏర్పడ్డాయనే ప్రచారం మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తాజాగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వ్యవహార శైలి అందుకు బలం చేకూరుస్తోందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇవాళ మహాయుతి కూటమి నేతలంతా నాగ్‍పుర్‍లోని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్మారక మందిరాన్ని ఆదివారం సందర్శించారు. ఈ కార్యక్రమానికి అజిత్ పవార్ గానీ, ఎన్సీపీ ఎమ్మెల్యేలుగానీ హాజరు కాలేదు. అయితే గతంలో జరిగిన ఆర్ఎస్ఎస్ శతవసంత వేడుకల్లోనూ ఎన్సీపీ పాల్గొనలేదు. దీంతో ఎన్సీపీ తీరు వెనుక ఏదో ఉందని ఏడాది తిరగక ముందే అధికారపార్టీలో విభేదాలు ఏర్పడ్డాయని ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అనుసరించకపోతే కూటమిలో ఎన్సీపీ కొనసాగలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ వ్యాఖ్యలు చేయగా ఈ వ్యాఖ్యలకు ఎన్సీపీ కౌంటర్ ఇచ్చింది. ఎప్పటిలాగే ఎన్సీపీ అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని పేర్కొంది.

Next Story