- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL: ఆ బౌలర్ ను వదిలేయండి.. కేకేఆర్‍కు షాకిచ్చిన బీసీసీఐ
మినీ వేలంలో బంగ్లాదేశ్ ఆటగాడిని కొనుగోలు చేసిన షారూఖ్ ఖాన్ టీమ్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ 2026 (IPL 2026) మినీ వేలంలో బంగ్లాదేశ్ స్టార్ ఫేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‍ను కోల్‍కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) టీమ్ సొంతం చేసుకున్న విషయంలో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. రూ.9.2 కోట్లకు కేకేఆర్ టీమ్ ముస్తాఫిజుర్ రెహమాన్ దక్కించుకుంది. అయితే ఇటీవల బంగ్లాదేశ్‍లో హిందువుల మీద వరుస దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్ రెహమాన్ ను కేకేఆర్ అంత ధర చెల్లించి కొనుగోలు చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో బీసీసీఐ (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్తాఫిజుర్‍ను వదిలివేయాలని కేకేఆర్‍కు బీసీసీఐ ఆదేశించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తాజాగా వెల్లడించారు. ఈ ఆటగాడి స్థానంలో ప్రత్యామ్నాయం కోరితే ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ అనుమతి ఇస్తుందని తెలిపారు.
షారుఖ్ నిర్ణయమేంటి?:
బీసీసీఐ ఆదేశాలతో కేకేఆర్ టీమ్ ఓనర్ షారుఖ్‍ఖాన్ ఏం చేయబోతున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. ముస్తాఫిజుర్ (Mustafizur Rahman) లేకపోవడం కేకేఆర్ బౌలింగ్ విభాగానికి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ లేని లోటును కలిగిస్తుందని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక రూ. 9.20 కోట్లు పెట్టి కొన్న ఆటగాడు అందుబాటులో లేకపోతే అది కేవలం జట్టు కూర్పునే కాకుండా ఆర్థిక అంశాలను కూడా ప్రభావితం చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు ఐపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులో లేకపోతే లేదా గాయం కారణంగా టోర్నీ ప్రారంభానికి ముందే తప్పుకుంటే సదరు ఫ్రాంచైజీ ఆ ఆటగాడికి ఎటువంటి జీతం చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఈ ముస్తాఫిజుర్ విషయంలో ఆటగాడు సిద్ధంగా ఉన్నప్పటికీ బీసీసీఐ ఆదేశాలు రావడంతో ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ ఆదేశాలపై కేకేఆర్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.






