- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగ్లాదేశ్ మీడియా వార్తలు అవాస్తవం.. బీఎస్ఎఫ్ ఘాటు స్పందన
స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో నిందితులు ఇద్దరు భారత్‌లోకి ప్రవేశించారంటూ బంగ్లాదేశ్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో నిందితులు ఇద్దరు భారత్‌లోకి ప్రవేశించారంటూ బంగ్లాదేశ్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను సరిహద్దు భద్రతా దళం (BSF) తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, కల్పితమని, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మెఘాలయ సెక్టార్ బీఎస్ఎఫ్ ఐజీ ఓపీ ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు. కేవలం మూడు రోజుల క్రితమే బంగ్లాదేశ్‌కు చెందిన ఐజీ స్థాయి అధికారి తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని చెప్పగా, ఇప్పుడు డీఐజీ స్థాయి అధికారి పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హమని ఆయన పేర్కొన్నారు.
మెఘాలయ సరిహద్దుల్లో ఎటువంటి చొరబాట్లు లేవు
ఉస్మాన్ హాదీ హత్య నిందితులను మెఘాలయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. పోలీసుల విచారణలో అటువంటి అరెస్టులు ఏవీ జరగలేదని తేలింది. "ఢాకా నుండి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దును దాటి భారత్‌లోకి రావడం, అది కూడా బంగ్లాదేశ్‌లో ఉన్న సీసీటీవీ నిఘా, చెక్‌పోస్టులను దాటుకుని రావడం అసాధ్యం" అని ఐజీ ఉపాధ్యాయ్ వివరించారు. బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ (BGB) కూడా ఈ ఘటనపై ఎటువంటి నివేదిక ఇవ్వలేదని, బంగ్లా మీడియాలో వస్తున్న కథనాల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు.






