- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bangladesh: చర్చలతో పరిష్కరించుకుంటా.. భారత్ లో వాణిజ్య సమస్యలపై బంగ్లాదేశ్ స్పందన
బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా దిగిపోయినప్పట్నుంచి అక్కడి రాజకీయాలు మారిపోయాయి. భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రికత్తలు పెరిగాయి.

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా దిగిపోయినప్పట్నుంచి అక్కడి రాజకీయాలు మారిపోయాయి. భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రికత్తలు పెరిగాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య సమస్యలు తలెత్తాయి. అయితే, భారత్ తో నెలకొన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించుకుంటామని మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఈ మేరకు బంగ్లా వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ విలేకరులతో మాట్లాడారు. ‘భారత్ తీసుకున్న చర్యలకు సంబంధించి అధికారిక సమాచారం అందలేదు. అధికారికంగా సమాచారం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. ఏమైనా సమస్యలు ఉంటే చర్చలతో వాటిని పరిష్కరించుకొంటాం. అఖౌరా, డాకి పోర్టులతో పాటు కొన్ని సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి పలు నిర్ణయాలను భారత్ తీసుకున్నట్లు మీడియా ద్వారానే తెలిసింది. ఇది ఇరు దేశాలకు సంబంధించిన వాణిజ్య వ్యవహారం. వస్త్ర పరిశ్రమలో భారత్ అగ్రస్థానంలో ఉందని మేం భావిస్తున్నాం. అయినప్పటికీ.. ఆయా ఉత్పత్తులు మా దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయి. ఇది మా సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. భారత్- బంగ్లాలు పొరుగుదేశాలు. వాణిజ్యం, రవాణా వంటి రంగాల్లో కచ్చితంగా పోటీ ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సార్లు మేం పరిమితులు విధిస్తాం. భారత్ కూడా అలాగే చేస్తోంది. ఇదంతా వాణిజ్య ప్రక్రియ. ఇందులో ఎలాంటి సమస్యలు ఉంటే ఇరు దేశాలు చర్చలతో పరిష్కరించుకుంటాయి.’ అని ఆయన పేర్కొన్నారు.
ఈశాన్య రాష్ట్రాల సరకులపై ఆంక్షలు
అయితే, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే సరకులపై ఇటీవలే బంగ్లాదేశ్ (Bangladesh) ఆంక్షలు విధించింది. దీనికి ప్రతిగా భారత్.. ఢాకా దిగుమతులపై ఆంక్షలు పెట్టింది. అందులో అక్కడి నుంచి దిగుమతయ్యే రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ ఫుడ్, కార్బొనేటెడ్ డ్రింక్స్, పత్తి, నూలు వ్యర్థాలు, ప్లాస్టిక్, పీవీసీ వస్తువులు, కలప ఫర్నీచర్ సహా పలు వస్తువులు ఇన్నాయి. ఈ ఉత్పత్తులను కోల్‌కతా పోర్టు, ముంబై జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు నుంచి మాత్రమే భారత్ లోకి అనుమతిస్తారు. అయితే, బంగ్లా నుంచి దిగుమతయ్యే చేపలు, ఎల్పీజీ, వనస్పతి, కంకర వంటి వాటికి ఈ ఆంక్షలు వర్తించవని భారత్ స్పష్టం చేసింది. దీనిపైనే, ఇప్పుడు బంగ్లాదేశ్ స్పందించింది.






