బంగ్లాదేశ్‌కు శస్త్రచికిత్స అవసరం.. సీఎం హిమంత బిస్వ శర్మ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

హిందువులపై దాడులకు పాల్పడుతున్న బంగ్లాదేశ్‌ (Bangladesh)కు శస్త్రచికిత్స అవసరమని అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ (CM Himanta Biswa Sarma) సంచలన వ్యాఖ్యలు చేశారు.

బంగ్లాదేశ్‌కు శస్త్రచికిత్స అవసరం.. సీఎం హిమంత బిస్వ శర్మ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హిందువులపై దాడులకు పాల్పడుతున్న బంగ్లాదేశ్‌ (Bangladesh)కు శస్త్రచికిత్స అవసరమని అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ (CM Himanta Biswa Sarma) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌తో దౌత్యానికి సమయం దాటిపోయిందని అన్నారు. ఇక శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని కామెంట్ చేశారు. బంగ్లాదేశ్‌తో భారత ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు పెను ముప్పు ఉందని అన్నారు.

సిలిగురి కారిడార్ (Chicken Neck)లో వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్ ఆందోళనలు సృష్టించేందుకు అవకాశం ఉందన్నారు. ఈ ఇరుకైన ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగతా భాగాలతో కలుపుతుంది, ఇక రెండు వైపులా బంగ్లాదేశ్ భూభాగం ఉందన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఏదో ఒకరోజు భారత్ 20-22 కి.మీ. బంగ్లాదేశ్ భూభాగాన్ని బలవంతంగా తీసుకోవాల్సి రావొచ్చని అన్నారు. ఔషధం పని చేయనప్పుడు సర్జరీ అవసరమనే నానుడిని బంగ్లాదేశ్ విషయంలో పాటించాలన్నారు. బంగ్లాదేశ్ మధ్యంతర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, మహ్మద్ యూనుస్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని అన్నారు. ప్రస్తుత పాలన భారత్‌కు, ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలకు తీవ్ర ఆందోళన కలిగించే పరిస్థితులు సృష్టిస్తోందని సీఎం హిమంత బిస్వ శర్మ తెలిపారు.

Next Story