- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ షాక్.. ఆ వస్తువుల దిగుమతులపై నిషేధం !
బంగ్లాదేశ్‌కు భారత్ భారీ షాక్ ఇచ్చింది. రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు సహా ఇతర వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించింది.

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌కు భారత్ భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు సహా ఇతర వస్తువుల దిగుమతులపై ఇండియా పోర్ట్ ఆంక్షలు విధించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులను కోల్‌కతా, నవా షెవా ఓడరేవుల ద్వారా మాత్రమే అనుమతించనున్నారు. అలాగే ఈశాన్యంలోని ల్యాండ్ ట్రాన్సిట్ పోస్టుల నుంచి సైతం పలు వస్తువుల దిగుమతిని నిషేధించింది. వీటిలో రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్, ప్లాస్టిక్, ఫర్నిచర్, కార్బోనేటేడ్ పానీయాలు ఉన్నాయి. ఈ వస్తువులను మేఘాలయ, అసోం, త్రిపుర, మిజోరం, పశ్చిమ బెంగాల్‌లోని ఫుల్బారి, చంగ్రబంధలోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు, చెక్ పోస్టుల ద్వారా భారత్‌లోకి అనుమతించరు. అయితే ఈ ఆంక్షలు భారత్ గుండా భూటాన్, నేపాల్‌లకు రవాణా చేసే బంగ్లాదేశ్ వస్తువులకు వర్తించవు.
ఇప్పటివరకు బంగ్లాదేశ్ తన వస్తువులను భారతదేశంలోని ఈశాన్య ప్రాంత మార్కెట్లకు ఎటువంటి పరిమితులు లేకుండా ఎగుమతి చేస్తోంది. భారత్ వస్తువులకు కిలోమీటరుకు టన్నుకు 1.8 టాకా వసూలు చేస్తుండగా, ఇది దాని దేశీయ రేటు 0.8 టాకా కంటే ఎక్కువ. కొత్త ఆంక్షల కారణంగా బంగ్లాదేశ్ తన ఎగుమతి మార్గాన్ని మార్చుకోవలసి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. కాగా, ఇటీవల చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియా పై ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది.






