- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flash News: బంగ్లా మాజీ ప్రధానికి 6 నెలలు జైలు శిక్ష
సొంతదేశంలో రాజకీయ తిరుగుబాటు పరిస్థితి నెలకొనడంతో భారత్ లో తలదాచుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు 6 నెలలు జైలు శిక్ష పడింది.

దిశ, వెబ్‌డెస్క్: సొంతదేశంలో రాజకీయ తిరుగుబాటు పరిస్థితి నెలకొనడంతో భారత్ లో తలదాచుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు 6 నెలలు జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కార కేసులో (Contempt of Court) ఆమెకు 6 నెలలు శిక్ష విధిస్తూ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. జస్టిస్ ఎండీ గోలం మోర్టుజా మొజుందర్ అధ్యక్షతన ఉన్న అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ -1 (International Crimes Tribunal) ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించినట్లు ఢాకా ట్రిబ్యున్ నివేదించింది. హసీనాతో పాటు.. గైబంధలోని గోవిందగంజ్ కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్ కుకూడా ట్రిబ్యునల్ అదే తీర్పులో 2 నెలల జైలు శిక్ష విధించింది. 11 నెలల క్రితం పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి పారిపోయిన అవామీ లీగ్ (Awami League) మాజీ నాయకురాలికి పడిన తొలి శిక్ష ఇదే కావడం గమనార్హం. దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.






