Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం..అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రం

by vinod kumar |
Bangladesh Crisis: బంగ్లాదేశ్ సంక్షోభం..అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం కీలక పరిణామాలు చేటుచేసుకున్నాయి. ఆ దేశంలో ప్రస్తుతం బీఎన్‌పీ-జమాతే కూటమి అధికారాన్ని చేపట్టబోతుందంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ కూటమి పగ్గాలు చేపడితే ఆ ప్రభావం భారత్‌పై పడే అవకాశం ఉన్నట్టు పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ హాలులో విదేశాంగ మంత్రి జైశంకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ భేటీకి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితిని జైశంకర్ వారికి వివరించినట్టు తెలుస్తోంది. అక్కడి భారతీయులను స్వదేశానికి రప్పించాలా లేదా అన్ని విషయంపై కూడా చర్చించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్‌లో జరిగే పరిణామాలపై పార్లమెంటులోనూ కేంద్ర ప్రకటన చేయనున్నట్టు సమాచారం.



Next Story