పాక్‌కు చుక్కలు చూపిస్తున్న బలుచిస్థాన్..రోడ్లపైకి వచ్చి నిరసనలు

by Ajay Maddhiboyina |

పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ వేర్పాటువాద ఉద్యమం తీవ్రతరం అవుతోంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లమీదకు వస్తున్నారు.

పాక్‌కు చుక్కలు చూపిస్తున్న బలుచిస్థాన్..రోడ్లపైకి వచ్చి నిరసనలు
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ వేర్పాటువాద ఉద్యమం తీవ్రతరం అవుతోంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లమీదకు వస్తున్నారు.పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని యూఎన్‌ను సైతం కోరుతున్నారు. నిజానికి ఒకప్పుడు బలూచిస్థాన్ ప్రత్యేక దేశం కాగా దానిని పాకిస్థాన్ ఆక్రమించుకుంది. అనంతరం పాకిస్థాన్ పెడుతున్న ఆంక్షలతో బలూచ్ ప్రజలు విసిగిపోయారు.

ఈ నేపథ్యంలోనే తమకు స్వాతంత్య్రం కావాలని పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. పాక్ ఆర్మీపై బలూచిస్థాన్ ఆర్మీ మెరుపుదాడులు చేసి చాలా మందిని హతమార్చింది. ఇండియా పాక్ ఉద్రిక్తతల సమయంలో బలూచిస్థాన్ ఓ ప్రాంతాన్ని కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇండియాకు బలూచిస్థాన్ మద్దతిస్తూ యుద్దాన్ని విరమించుకోవద్దని పాక్‌ను దెబ్బ కొట్టడంతో తాము కూడా తోడుగా ఉంటామని ముందుకు వచ్చింది. శత్రువుకు శత్రువు మిత్రడు అన్నట్టు తమ శతృవును దెబ్బ కొట్టిన భార‌త్ పై ఎంతో ప్రేమ చూపిస్తోంది. ప‌రిస్థితులు చూస్తుంటే రేపో మాపో బ‌లూచిస్థాన్ ప్ర‌త్యేక దేశంగా ఏర్ప‌డ‌టం త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

Next Story