- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: రన్యారావు, తరుణ్ రాజ్‌కు బెయిల్
గోల్డ్ స్మగ్లింగ్ కేసు (Gold Smuggling Case)లో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు, తరుణ్ రాజ్‌కు బెంగళూరు కోర్టు (Bengaluru Court)బెయిల్ మంజూరు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: గోల్డ్ స్మగ్లింగ్ కేసు (Gold Smuggling Case)లో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు, తరుణ్ రాజ్‌కు బెంగళూరు కోర్టు (Bengaluru Court)బెయిల్ మంజూరు చేసింది. దుబాయ్ నుంచి అక్రమంగా 14 కేజీలకు పైగా బంగారాన్ని తరలిస్తుండగా.. మార్చి 3న అధికారులు ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సెషన్స్ కోర్టులో బెయిల్ కు అప్లై చేయగా కోర్టు నిరాకరించింది. బంగారం కొనుగోలుకు హవాలా మార్గాన్ని ఉపయోగించారని ఆరోపిస్తూ సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. హవాలా ఏజెంట్ అని ఆరోపించబడిన సాహిల్ జైన్ బెయిల్ దరఖాస్తును ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు కూడా తిరస్కరించింది. తాజాగా బెయిల్ వచ్చినా విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు ఉండటంతో.. రన్యారావు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఆమెపై డీఆర్ఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేయలేదు.






