- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
140 దేశాలకు భద్రీనాథ్, కేదార్‌నాథ్ ప్రసారం
by Ajay Maddhiboyina |
బద్రీనాథ్ కేదార్ నాథ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. చార్ ధామ్ యాత్రకు ఏడాదిలో కొన్నిరోజులు మాత్రమే అనుమతి ఉండటంతో దర్శించుకోలేని భక్తులకు ప్రసాదాన్ని పంపించే ఏర్పాట్లు చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: బద్రీనాథ్ కేదార్ నాథ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. చార్ ధామ్ యాత్రకు ఏడాదిలో కొన్నిరోజులు మాత్రమే అనుమతి ఉండటంతో దర్శించుకోలేని భక్తులకు ప్రసాదాన్ని పంపించే ఏర్పాట్లు చేసింది. మొత్తం 140 దేశాలకు ప్రసాదం ఎగుమతి చేయాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో కూడా ఏ ప్రాంతంలోని వారైనా ప్రసాదం ఆర్డర్ చేసుకోవచ్చని పేర్కొంది.
ప్రసాదం ఆర్డర్ చేసుకుంటే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తామని ఆలయ కమిటీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి తపాలాశాఖతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది. 24 గంటల నుండి 72 గంటల్లోగా దేశంలోని ఎక్కడికైనా ప్రసాదం పంపిస్తామని స్పష్టం చేసింది. అయితే విదేశాలకు మాత్రం దేశాల దూరాన్ని బట్టి చేరుకుంటుందని తెలిపింది. కాబట్టి ఎవరైనా బద్రీనాత్-కేదార్‌నాథ్ ప్రసాదం కావాలంటే సంబంధిత ఆలయ నుండి ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది.
Next Story






