- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Badrinath: తెరచుకున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు
చార్‌ధామ్ యాత్ర (Chardham Yatra)లో అత్యంత కీలకమైన బద్రీనాథ్ ఆలయ (Badrinath Temple) ద్వారాలు ఆదివారం ఉదయం 6 గంటలకు తెరచుకున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: చార్‌ధామ్ యాత్ర (Chardham Yatra)లో అత్యంత కీలకమైన బద్రీనాథ్ ఆలయ (Badrinath Temple) ద్వారాలు ఆదివారం ఉదయం 6 గంటలకు తెరచుకున్నాయి. ఆలయ ద్వారాలు తెరచుకోగానే 6 నెలలుగా వెలుగుతోన్న అఖండ జ్యోతిని దర్శించుకునేందుకు 10 వేల మందికి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా భక్తులపై పూలవర్షం కురిపించింది. ఆలయాన్ని సుమారు 15 క్వింటాళ్ల బంతిపువ్వులతో సర్వాంగసుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. చార్‌ధామ్ యాత్ర కోసం ఉత్తరాఖండ్‌కు వచ్చే యాత్రికులందరినీ స్వాగతిస్తున్నానన్నారు. యాత్రికులందరి ప్రయాణం సజావుగా సాగాలని ప్రార్థిస్తున్నానన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో బద్రినాథుడి ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కాగా.. చార్‌ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు మే2న తెరచుకున్నాయి. ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై చార్‌ధామ్ యాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాయి. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల గురించి పోలీసులకు సమాచారమివ్వాలని భక్తులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.






