- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Badlapur: నిందితుడి ఎన్‌కౌంటర్‌కు పోలీసులే బాధ్యులు.. బద్లాపూర్ లైంగిక దాడి కేసులో నివేదిక
బద్లాపూర్ స్కూల్‌లో జరిగిన లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న అక్షయ్ షిండే ఎన్ కౌంటర్‌కు ఐదుగురు పోలీసులే కారణమని వెల్లడైంది.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని బద్లాపూర్ స్కూల్‌లో జరిగిన లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న అక్షయ్ షిండే (Akshay shinde) ఎన్ కౌంటర్‌కు ఐదుగురు పోలీసులే కారణమని మెజిస్టీరియల్ విచారణలో వెల్లడైంది. ఈ మేరకు మేజిస్ట్రేట్ సోమవారం తన నివేదికను బాంబే హైకోర్టుకు అందజేసింది. దీంతో జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన డివిజన్ బెంచ్ రిపోర్టును పరిశీలించింది. నిందితుడి మృతికి వ్యాన్‌లో ఉన్న పోలీసులే కారణమని వెల్లడైనందున వారిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి చట్టపరమైన విచారణ జరపుతామని తెలిపింది. ఈ ఐదుగురిపై ఎలాంటి విచారణ చేపడతారు? ఏ సంస్థ దర్యాప్తు చేస్తుంది అనే వివరాలను రెండు వారాల్లో తెలపాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
కాగా, గతేడాది ఆగస్టు 12న బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల బాలికలపై లైంగిక వేధింపుల ఘటన చోటు చేసుకుంది. అనంతరం అదే పాఠశాలలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తు్న్న అక్షయ్ షిండేను పోలీసులు నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్తుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో అక్షయ్ మరణించారు. వ్యాన్‌లో ఉన్న ఒక పోలీసు తుపాకీని లాక్కుని పారిపోతుండగా ప్రతీకార కాల్పుల్లో అక్షయ్ ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన తండ్రి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ తాజాగా నివేదిక అందజేసింది.






