అరచేతిలో ఇమిడేలా.. యాపిల్ కన్నా చిన్నగా.. 350 గ్రా. బరువుతో పుట్టిన శిశువు

by Sujitha Rachapalli |

అరచేతిలో ఇమిడేలా.. యాపిల్ కన్నా మరీ చిన్నగా పుట్టింది ఓ చిన్నారి. పుట్టినప్పుడు కేవలం 350 గ్రాములు మాత్రమే ఉండగా.. 124 రోజుల పోరాటం తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లింది. ప్రతిరోజూ ఒక పోరాటం చేసింది.. ఓ అద్భుతంగా గెలిచింది

అరచేతిలో ఇమిడేలా.. యాపిల్ కన్నా చిన్నగా.. 350 గ్రా. బరువుతో పుట్టిన శిశువు
X

దిశ, వెబ్ డెస్క్ : అరచేతిలో ఇమిడేలా.. యాపిల్ కన్నా మరీ చిన్నగా పుట్టింది ఓ చిన్నారి. పుట్టినప్పుడు కేవలం 350 గ్రాములు మాత్రమే ఉండగా.. 124 రోజుల పోరాటం తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లింది. ప్రతిరోజూ ఒక పోరాటం చేసింది.. ఓ అద్భుతంగా గెలిచింది. ఇండియాలో ఇప్పటివరకు తక్కువ బరువుతో పుట్టి బతికిన వారిలో ఆమె అతి తక్కువ బరువుతో బయటపడిన శిశువుగా రికార్డ్ క్రియేట్ చేసింది. మొత్తానికి ఐదు రెట్ల బరువు పెరిగి 1.8 కిలోల బరువుతో పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వెళ్లింది.

ముంబై సాంతాక్రూజ్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో పుట్టిన ఈ బిడ్డ 124 రోజులు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంది. న్యూమోనియా, సైటోమెగలోవైరస్ ఇన్ఫెక్షన్, కళ్ల సమస్యలు, రక్తహీనత, ఎముకల బలహీనత… ఇలా అనేక అనారోగ్యాలు చుట్టుముట్టాయి. చాలా సార్లు రక్తమార్పిడి, ఇన్సులిన్, అత్యాధునిక వెంటిలేటర్ సహాయంతో డాక్టర్లు ఆమెను కాపాడారు. మొత్తానికి ఇప్పుడు ఆమె నాడీ వ్యవస్థ వయసుకు తగినట్లుగా పూర్తిగా సాధారణంగా ఉందని తెలిపారు. ఆమెు ఓ ఆద్భుతంగా పరిగణించారు.

Next Story