- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నింగిలోకి దూసుకెళ్లిన 'బాహుబలి' రాకెట్.. ఇస్రో ఖాతాలో మరో భారీ వాణిజ్య విజయం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం సరిగ్గా 08:55:30 గంటలకు LVM3-M6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

దిశ, వెబ్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం సరిగ్గా 08:55:30 గంటలకు LVM3-M6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్‌మొబైల్ సంస్థ రూపొందించిన అత్యంత భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్-2 (BlueBird Block-2) ను ఇది విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. మొత్తం మూడు దశల్లో 15 నిమిషాల్లో ఈ ప్రయోగం సక్సెస్ అయింది. సుమారు 6,100 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం, ఇస్రో ఇప్పటివరకు ప్రయోగించిన అత్యంత బరువైన వాణిజ్య పేలోడ్‌గా రికార్డు సృష్టించింది. దీంతో ఇస్రో కేంద్రంలో సంబరాలు మొదలయ్యాయి.
ఈ ప్రయోగం ప్రపంచ కమ్యూనికేషన్ రంగంలోనే విప్లవాత్మక మార్పులకు బాటలు వేయనుంది. బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం ద్వారా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు నేరుగా అంతరిక్షం నుండి 4G/5G సిగ్నల్స్ అందుతాయి. దీనివల్ల ఎటువంటి సిగ్నల్స్ లేని మారుమూల ప్రాంతాల్లో కూడా మొబైల్ సేవలు పొందే వీలుంటుంది. లో ఎర్త్ ఆర్బిట్ (LEO) లో అతిపెద్ద వాణిజ్య ఉపగ్రహంగా గుర్తింపు పొందిన దీని యాంటెన్నా విచ్చుకున్న తర్వాత ఏకంగా 223 చదరపు మీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది. ఈ విజయంతో అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష మార్కెట్‌లో భారత్ మరోసారి తన సత్తా చాటింది.






