- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రెండ్‌కి సహాయం చేయబోయి.. రూ.7 కోట్ల సైబర్ మోసంలో ఇరుక్కున్న విద్యార్థి
స్నేహితుడిని ఆదుకోవాలని తన బ్యాంక్ డీటెయిల్స్, సిమ్, ఆన్లైన్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేశాడో బీటెక్ విద్యార్థి.

దిశ, వెబ్‌డెస్క్: ఆపదలో ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు అనుకున్నాడో విద్యార్థి. అదే అతన్ని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. తన స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని సాయం చేయబోతే.. ఏకంగా రూ.7 కోట్ల సైబర్ ఫ్రాడ్ కేసులో నిందితుడిగా మారిపోయాడు. నమ్మకమే పెట్టుబడిగా సాగిన ఈ మోసం ఇప్పుడు బెంగళూరు నగరంలో కలకలం రేపుతోంది.
అసలేం జరిగింది?
నగరంలోని ఒక ప్రముఖ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న సదరు విద్యార్థికి, ఆయుష్ అనే వ్యక్తితో ఏడాది కాలంగా స్నేహం ఉంది. గత ఏడాది (నవంబర్ 2025) ఆయుష్ తన బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యిందని, అర్జంటుగా లావాదేవీల కోసం అకౌంట్ కావాలని విద్యార్థిని కోరాడు. స్నేహితుడిని గుడ్డిగా నమ్మిన ఆ విద్యార్థి తన కర్ణాటక గ్రామీణ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన కీలక వివరాలన్నీ ఇచ్చేశాడు. ఏటీఎంకు లింక్ అయిన ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి, పాస్‌వర్డ్, ఈ డాక్యుమెంట్లు అన్నింటినీ కొరియర్ ద్వారా పంపగా.. వాటిని అందుకున్నట్లు ఆయుష్ వాట్సాప్‌లో మెసేజ్ కూడా చేశాడు.
రూ. 7 కోట్ల మోసం వెలుగులోకి..
కొన్ని నెలల తర్వాత సదరు బ్యాంక్ నుండి విద్యార్థికి సమాచారం రావడంతో అసలు విషయం బయటపడింది. ఆ అకౌంట్ ద్వారా భారీ స్థాయిలో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు బ్యాంక్ గుర్తించింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో దాదాపు రూ. 7 కోట్ల రూపాయల సైబర్ మోసం ఆ అకౌంట్ ద్వారా జరిగినట్లు తేలింది. తన అకౌంట్ దుర్వినియోగం అయ్యిందని గ్రహించిన విద్యార్థి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై నార్త్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఆయుష్, ఇతరులపై కేసు నమోదైంది. ఈ మోసానికి గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.






