- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాక్సియం-4 మిషన్ విజయవంతం.. ISSలోకి శుభాంశు బృందం
యాక్సియం-4 మిషన్ విజయవంతం అయింది. శుభాంశు బృందం సక్సెస్‌ఫుల్‌గా రోదసిలోకి దూసుకెళ్లింది.

దిశ, వెబ్‌డెస్క్: యాక్సియం-4 మిషన్ విజయవంతం అయింది. శుభాంశు బృందం సక్సెస్‌ఫుల్‌గా రోదసిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్‌ను నిర్వహించింది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహించాయి. ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండే.. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్య తలెత్తడం వంటి కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ఇవాళ విజయవంతంగా పూర్తయింది. ISSలో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉండనుంది. ISSలో పలు కీలక ప్రయోగాలు చేయబోతున్నారు. ISSలో అడుగుపెట్టిన తొలి భారతీయుడి శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించాడు. దీంతో ఆయన్ను అంతా అభినందిస్తున్నారు.






