- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘యాక్సియం-4’ ప్రయోగం వాయిదా.. శుభాంశు శుక్లాకు మళ్లీ నిరాశే
‘యాక్సియం-4’ (‘Axiom-4’) ప్రయోగం వాయిదా పడిందని తాజాగా నాసా ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: ‘యాక్సియం-4’ (‘Axiom-4’) ప్రయోగం వాయిదా పడిందని తాజాగా నాసా ప్రకటించింది. దీంతో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడినట్లైంది. యాక్సియం-4 ప్రయోగానికి సంబంధించి టెక్నికల్ టీమ్‌తో సంప్రదించి త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. అయితే, ప్రయోగంలో భాగంగా భారత్‌కు చెందిన శుభాంశు శుక్లా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్‌తో కలిసి స్పేస్‌లోకి వెళ్లనున్నాడు. అమెరికాకు చెందిన కమర్షియల్ స్పేస్ కంపెనీ ‘యాక్సియం స్పేస్’ (‘Axiom Space’) మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ఇస్రో (ISRO), అమెరికా అంతరిక్ష సంస్థ (NASA), ఐరోపా అంతరిక్ష సంస్థ (ESA)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. నిజానికి ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకపోవడం, టెక్నికల్ సమస్యలు ఉత్పన్నమవడంతో వాయిదా పడుతూ వస్తోంది.






