Awami League: బంగ్లాదేశ్ నుంచి అవామీ లీగ్‌ను నిషేధిస్తాం.. యూనస్ సలహాదారు మహఫూజ్ ఆలం

by B.Srinivas |

అవామీ లీగ్ పార్టీని బంగ్లాదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధిస్తామని యూనస్ సలహాదారు మహఫూజ్ ఆలం అన్నారు

Awami League: బంగ్లాదేశ్ నుంచి అవామీ లీగ్‌ను నిషేధిస్తాం.. యూనస్ సలహాదారు మహఫూజ్ ఆలం
X

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik haseena) కు చెందిన అవామీ లీగ్ పార్టీని బంగ్లాదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధిస్తామని తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ సలహాదారు మహఫూజ్ ఆలం అన్నారు. సెంట్రల్ చాంద్‌పూర్ జిల్లాలో శనివారం జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. బంగ్లాదేశ్ అనుకూల పార్టీలను మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), జమాతే ఇస్లామీ, ఇతర బంగ్లాదేశ్ అనుకూల గ్రూపులు మాత్రం తమ రాజకీయాలను నిలబెట్టుకోగలుగుతాయన్నారు. వీటిలో ఏదో ఒకటి న్యాయమైన ఎన్నికల ప్రక్రియ ద్వారా భవిష్యత్ పాలనకు బాటలు వేస్తాయన్నారు. అవామీ లీగ్ పార్టీ బంగ్లాదేశ్ వ్యతిరేకి ఆ పార్టీ దేశంలో మళ్లీ అభివృద్ధి చెందడానికి వీలులేదన్నారు. అవసరమైన సంస్కరణలు చేసే వరకు, హసీనా ప్రభుత్వ నాశనం చేసిన సంస్థలను సరిదిద్దే వరకు దేశంలో ఎన్నికలు జరగబోవని తెలిపారు. అయితే అంతకుముందు తాత్కాలిక ప్రభుత్వాధి నేత మహమ్మద్ యూనస్ మాట్లాడుతూ 2025 చివరిలో లేదా వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.

Next Story