జనవరి 1న డీఎస్పీ అనుమానాస్పద మృతి.. మిస్టరీకి తెర

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : ఆయన ఒక డీఎస్పీ. 2000 సంవత్సరంలో అర్జున అవార్డును కూడా అందుకున్న ట్యాలెంటెడ్ వెయిట్ లిఫ్టర్.

జనవరి 1న డీఎస్పీ అనుమానాస్పద మృతి.. మిస్టరీకి తెర
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆయన ఒక డీఎస్పీ. 2000 సంవత్సరంలో అర్జున అవార్డును కూడా అందుకున్న ట్యాలెంటెడ్ వెయిట్ లిఫ్టర్. ఓవైపు పోలీసు అధికారిగా.. మరోవైపు దేహ దారుఢ్యం కలిగిన వెయిట్ లిఫ్టర్‌గా నేపథ్యం కలిగిన పంజాబ్ ఆర్మ్‌డ్ పోలీస్ ప్రధాన కార్యాలయం డీఎస్పీీ దల్బీర్ సింగ్ దేవల్ (54) జనవరి 1న జలంధర్‌లో శవమై కనిపించారు. నగరంలోని ఒక కెనాల్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఆయన డెడ్ బాడీ లభ్యమైంది. సాక్షాత్తూ డీఎస్పీ స్థాయి అధికారి చనిపోవడంతో పంజాబ్ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. వేగంగా విచారణ చేసి.. నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. జలంధర్‌కు చెందిన విజయ్ కుమార్ అనే ఆటో డ్రైవర్‌ ఈ మర్డర్ చేశాడని గుర్తించారు. అతడి వద్ద నుంచి 9 ఎంఎం సర్వీస్ రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 1న నూతన సంవత్సరం వేడుకల తర్వాత ఇంటికి తిరిగి వెళ్తుండగా దల్బీర్ సింగ్ హత్యకు గురయ్యారు. ఆయన ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీల సీక్వెన్స్‌ను జోడించి.. పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు.

హత్య ఇలా జరిగింది..

డీఎస్పీ దల్బీర్ సింగ్ జలంధర్‌ బస్టాండ్ నుంచి ఒక ఆటో ఎక్కారు. తాను నివసించే ఖోజేవాల్ గ్రామంలో దింపమని ఆటో డ్రైవర్‌ను కోరారు. అయితే ఆ రాత్రి టైంలో అక్కడి దాకా వెళ్లలేనని ఆటో డ్రైవర్ తేల్చి చెప్పాడు. దీంతో కనీసం ఖోజేవాల్ గ్రామం దగ్గరి వరకైనా తీసుకెళ్లాలని డీఎస్పీ రిక్వెస్ట్ చేశారు. అయినా ఆటో డ్రైవర్ వినకపోవడంతో.. ఇద్దరి మధ్య బాగా గొడవ జరిగింది. ఈక్రమంలో డీఎస్పీ దగ్గరున్న సర్వీస్ రివాల్వర్‌ను లాక్కొని ఆటో డ్రైవర్ కాల్చి చంపాడని పోలీసు అధికారులు వెల్లడించారు.

Next Story