- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Australia: అస్ట్రేలియాలో లేబర్ పార్టీ విజయం.. ట్రంప్ ప్రభావం ఎంతంటే!
అస్ట్రేలియా సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. ఆ దేశంలో శనివారం ఎలక్షన్స్ జరగగా పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాల లెక్కించారు.

దిశ, నేషనల్ బ్యూరో: అస్ట్రేలియా సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ (Labour party) విజయం సాధించింది. ఆ దేశంలో శనివారం ఎలక్షన్స్ జరగగా పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాల లెక్కింపు చేపట్టారు. దీంతో శనివారం అర్థరాత్రి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. మొత్తం 150 స్థానాలకు గాను లేబర్ పార్టీ 89 సీట్లలో గెలుపొందింది. అలాగే ప్రతిపక్ష లిబరల్ నేషనల్ కూటమి 36 స్థానాలను కైవసం చేసుకుంది. మెజారిటీకి అవసరమైన 76 సీట్ల కంటే ఎక్కువ మెజారిటీని లేబర్ పార్టీ సాధించినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. దీంతో ఆంథోనీ ఆల్భనీస్ (Anthony Albanese ) మరోసారి ప్రధానిగా ఎన్నికవనున్నారు. 21 ఏళ్లలో ఒక వ్యక్తి రెండు సార్లు ప్రధాని కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతకుమందు లిబరల్ పార్టీకి చెందిన జాన్ హోవార్డ్ రెండు సార్లు పీఎంగా నియామకమయ్యారు.
ఓటమిని అంగీకరించిన లిబరల్-నేషనల్ అలయెన్స్
ప్రతిపక్ష లిబరల్ నేషనల్ కూటమి ఓటమిని అంగీకరించింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పీటన్ డట్టన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తాము బాగా రాణించలేదని తెలిపారు. ఘన విజయం సాధించిన ఆల్బనీస్‌కు అభినందనలు తెలిపారు. అంతేగాక డక్సన్ స్థానంలోనూ డట్టన్ ఓడిపోవడం గమనార్హం. అంతకుముందు జరిగిన పోలింగ్‌లో ఆస్ట్రేలియన్లు ఉత్సాహంగా ఓటేశారు.
ఎన్నికల్లో ట్రంప్ ప్రభావం!
ఆస్ట్రేలియా ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రభావం స్పష్టంగా కనిపించినట్టు పలువురు భావిస్తున్నారు. ట్రంప్ విధించిన కఠినమైన వాణిజ్య సుంకాలు ఆల్బనీస్ విజయం సాధించడంలో సహాయపడ్డాయని భావిస్తున్నారు. ఎందుకంటే పీటర్ డట్టన్ ట్రంప్ అనుకూల వ్యక్తిగా పరిగణిస్తూ ఆల్బనీస్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు మాయమవుతాయని, ట్రంప్ లా కోతలు విధిస్తారని ప్రచారంలో పదే పదే ఇదే అంశాన్ని లేవనెత్తారు. తాము ఎన్నికల్లో గెలిస్తే ఆస్ట్రేలియాకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. దీంతో ట్రంప్ పాలనలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అంతరాయాన్ని ఆస్ట్రేలియన్లు గయనించారని, ఇది ఆల్బనీస్ కు ప్రయోజనం చేరూర్చిందని చెబుతున్నారు.
అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ
రెండో సారి ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికవనున్న ఆల్బనీస్ కు భారత ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపర్చడానికి ఆల్బనీస్‌తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ఉమ్మడి ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.






