లాయర్ రాకేష్ కిషోర్‌పై చర్యలకు భారత అటార్నీ జనరల్ గ్రీన్ సిగ్నల్

by Malleboina Mahesh |   (  Updated:2025-10-16 06:50:12  IST  )

సీజేఐ బీఆర్ గవాయ్ పై దాడికి ప్రయత్నించినందుకు లాయర్ రాకేష్ కిషోర్ చర్యలకు రాకేష్ కిషోర్ భారత అటార్నీ జనరల్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

లాయర్ రాకేష్ కిషోర్‌పై చర్యలకు భారత అటార్నీ జనరల్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్ (CJI BR Gavai) చేసిన వ్యాఖ్యలు నచ్చక లాయర్ రాకేష్ ఆయనపై బూటును విసిరారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే లాయర్ పై న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో.. లాయర్ రాకేష్ కిషోర్ (Lawyer Rakesh Kishore) ను పోలీసులు అరెస్ట్ చేయకుండానే వదిలేశారు. అనంతరం ఆయన అనేకసార్లు మీడియాతో మాట్లాడుతూ.. తాను చేసిన పనికి గర్వపడుతున్నట్లు చెప్పుకొచ్చారు.

దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పై బూటు విసిరేందుకు ప్రయత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్ పై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్య తీసుకోవాలని కోరుతూ..సీనియర్ అడ్వైజ్ వికాస్ సింగ్ (SCBA అధ్యక్షుడు) మరియు SG తుషార్ మెహతా జె సూర్యకాంత్ భారత అటార్నీ జనరల్ (Attorney General of India)ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ.. సీజేఐ పై చేసిన దాడి ఇంకా సోషల్ మీడియాలో కొనసాగుతోందని, లాయర్ రాకేష్ కిషోర్ తనకు పశ్చాత్తాపం లేదని ఇంకా చెబుతున్నారని గుర్తు చేశారు. అలాగే కొంతమంది ఈ దాడిని కీర్తిస్తున్నారని. ఇలాంటి దాడి చేయడానికి చాలా ఆలస్యం అయిందని చెబుతున్నారని SG తుషార్ మెహతా గుర్తు చేశారు. వారి వాదనల అనంతరం భారత అటార్నీ జనరల్ లాయర్ రాకేష్ కిశోర్ పై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలకు సమ్మతి తెలిపింది.

Next Story