- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీలిమిటేషన్ పేరుతో అధికార చోరీకి యత్నం.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల హక్కులను బీజేపీ కాలరాస్తోందని లోక్‌సభాపక్ష నేత రాహుల్ గాంధీ అరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ప్రకటిస్తూనే, దాని వెనుక ఉన్న ‘డీలిమిటేషన్’ (Delimitation) కుట్రను లోక్‌సభా పక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా తప్పుబట్టారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. డీలిమిటేషన్ పేరుతో బీజేపీ అధికార చోరీకి ప్రయత్నిస్తోందని, దీనివల్ల ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లు అమలు కావాలంటే డీలిమిటేషన్ జరగాలన్న నిబంధనను ఏంటని ప్రశ్నించారు. ఇది కేవలం రిజర్వేషన్ల అమలును ఆలస్యం చేసే ఎత్తుగడ మాత్రమే కాదని, దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని రాహుల్ విమర్శించారు.
ఇది సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం..
డీలిమిటేషన్ పేరుతో ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు దక్కాల్సిన రాజకీయ హక్కులను లాక్కునేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తోందని, ఆయా వర్గాలకు ఈ బిల్లులో సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని కామెంట్ చేశారు. బీజేపీ చేస్తోన్న ఈ కుటిల ప్రయత్నాలను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. మహిళా సాధికారత పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని, అన్ని వర్గాల హక్కుల కోసం పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ హెచ్చరించారు.






