- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Attack: కేంద్ర మంత్రి జైశంకర్‌కు తప్పిన ముప్పు.. దాడికి యత్నించిన ఖలిస్థానీలు (వీడియో వైరల్)
ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు భారీ ముప్పు తప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం లండన్ (London) పర్యటనలో ఉన్న కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ (Union External Affairs Minister Jaishankar)కు భారీ ముప్పు తప్పింది. ఛాఠమ్ హౌస్‌లోని థింక్ ట్యాంక్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కారులో ఆయన బయలుదేరుతుండగా.. అక్కడే ఉన్న ఖలిస్థానీ సానుభూతిపరులు (Khalistani Sympathizers) జైశంకర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కలకలం సృష్టించారు. ఏకంగా ఓ దుండగుడు భద్రతా సిబ్బందిని దాటుకుని ఆయన కారు వద్దకు మెరుపు వేగంతో దూసుకొచ్చి కేంద్ర మంత్రి జైశంకర్‌పై దాడికి యత్నించాడు. భారత జాతీయ జెండా (Indian National Flag)ను అవమానపరిచేలా ప్రవర్తించాడు. అయితే, అక్కడే ఉన్న పోలీసులు దుండగుడిని అరెస్ట్ చేసి ఖలిస్థానీ సానుభూతిపరులను (Khalistani Sympathizers) అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ నేపథ్యంలోనే దాడికి యత్నించే వరకు ఏం చేస్తున్నారంటూ జైశంకర్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై కేంద్రం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అంత పెద్ద విధ్వంసం జరిగినా.. అక్కడే ఉన్న అధికారులు స్పందించకపోవడం గమనార్హం.






