‘డొమినోస్’ ముందు పాలస్తీనాకు మద్దతు నిరసన.. పాకిస్తాన్‌కు సపోర్ట్ అనుకోని దాడి!

by Ramesh Naini |   (  Updated:2025-05-12 11:42:58  IST  )

భారత్‌లో (Palestine) పాలస్తీనాకు మద్దతుగా శాంతియుత నిరసన చేపట్టిన వారిపై దాడికి దిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

‘డొమినోస్’ ముందు పాలస్తీనాకు మద్దతు నిరసన.. పాకిస్తాన్‌కు సపోర్ట్ అనుకోని దాడి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో (Palestine) పాలస్తీనాకు మద్దతుగా శాంతియుత నిరసన చేపట్టిన వారిపై దాడికి దిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా (Israel-Palestine) ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతల నేపథ్యంలో (Domino's) డోమినోస్ పిజ్జా అవుట్‌లెట్‌ల ముందు పాలస్తీనాకు మద్దతుగా శనివారం నిరసన ప్రదర్శనలు చేశారు. గాజాలో సైనిక కార్యకలాపాల కోసం ఇజ్రాయెల్ దళాలకు డొమినోస్ సంస్థ ఆహారాన్ని అందించిందని, ఈ నేపథ్యంలో డొమినోస్ బాయ్ కాట్ అంటూ నిరసన చేశారు. రివల్యూషనరీ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, నవ జవాన్ భారత్ సభ, దిశా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, స్త్రీ ముక్తి లీగ్, ఢిల్లీ స్టేట్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వంటి అనేక పౌర సమాజ సంఘాలు, సంస్థల సహకారంతో ఈ నిరసనలు చేశారు.

ఈ నేపథ్యంలోనే పుణేలో డొమినోస్ ముందు పాలస్తీనాకి సపోర్ట్ చేస్తూ కాలేజీ స్టూడెంట్స్ నిరసన తెలిపారు. పాలస్తీనాకి మద్దతు తెలిపుతుంటే పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తున్నారని భావించి వారిపై కొందరు వాహనదారులు దాడికి ప్రయత్నించారు. మరోవైపు అక్కడే ఉన్న పలువురు ఇది పాకిస్తాన్ సపోర్ట్ కాదని గ్రహించి దాడికి దిగే వారిని అడ్డుకుని ఉద్రిక్తతగా ఉన్న వాతావరణాన్ని కంట్రోల్ లోకి తెచ్చారు.

Next Story