యూపీలో KFCపై దాడి

by Muthe.Rajitha |   (  Updated:2025-07-18 06:12:01  IST  )

ఉత్తరప్రదేశ్‌(UP)లోని ఘజియాబాద్‌లో శుక్రవారం ఉదయం కెఎఫ్‌సీ (KFC) ఔట్‌లెట్‌పై దాడి జరిగింది.

యూపీలో KFCపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌(UP)లోని ఘజియాబాద్‌లో శుక్రవారం ఉదయం కెఎఫ్‌సీ (KFC) ఔట్‌లెట్‌పై దాడి జరిగింది. ఘజియాబాద్‌(Ghajiabad)లోని ఇందిరాపురంలో ఉన్న KFC రెస్టారెంట్ లోకి చొచ్చుకు వెళ్ళిన హిందూ రక్షా దళ్ సభ్యులు, శ్రావణ మాసంలో నాన్ వెజ్ అమ్మొద్దు అంటూ నిర్వహకులను బెదిరించారు. శ్రావణమాసంలో నాన్‌వెజ్ అమ్ముతున్నారని ఆరోపిస్తూ, జై శ్రీరామ్ నినాదాలతో షాపు షట్టర్ మూసివేశారు. కాంవర్ యాత్ర మార్గాల్లో మాంసం అమ్మకాలు భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నాయని, 100-200 మీటర్ల పరిధిలో నాన్‌వెజ్ షాపులపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.

కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని హిందూ రక్షా దళ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు నమోదు చేశారు. యూపీలోని పలు ప్రాంతాల్లో జూలై 11 నుంచి శ్రావణ మాసం మొదలవుతోందని, ఇకపై నాన్ వెజ్ అమ్మకూడదు అని పోస్టర్లు వెలిశాయి. అయితే తాజా ఘటనపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. నాన్ వెజ్ తినడం, తినకపోవడం వ్యక్తిగత విషయం అని, షాపులపై దాడులు ఏంటని మండిపడుతున్నారు.

Next Story