భారతీయుల నౌక ‘MT జల్‌వీర్’‌పై దాడి.. వీడియో ఫుటేజీని విడుదల చేసిన US

by Kema Shiva Kumar |

హార్ముజ్ జలసంధిలో భారతీయులతో కూడిన ‘MT జల్‌వీర్’ నౌకపై జరిగిన అటాక్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని అమెరికా సైన్యం విడుదల చేసింది.

భారతీయుల నౌక ‘MT జల్‌వీర్’‌పై దాడి.. వీడియో ఫుటేజీని విడుదల చేసిన US
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా జలాల్లో హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో భారతీయ నావికులు (Indian Crew) ప్రయాణిస్తున్న MT జల్‌వీర్ (MT Jalveer) వాణిజ్య నౌకపై జరిగిన భయంకరమైన దాడికి సంబంధించిన అధికారిక వీడియో ఫుటేజీని తాజాగా అమెరికా సైన్యం విడుదల చేసింది. అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో రక్షణ కల్పిస్తున్న అమెరికా సెంట్రల్ కమాండ్ (US CENTCOM) ఈ వీడియోను బహిర్గతం చేసింది. ఆ వీడియోలో నడి సముద్రంలో ప్రయాణిస్తున్న ఎంటి జల్‌వీర్ నౌకను లక్ష్యంగా చేసుకుని ముసుగు దాడులు జరిగినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక క్షిపణి వచ్చి నౌకను బలంగా ఢీకొట్టడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున మంటలు, పొగలు రావడం ఫుటేజీలో స్పష్టంగా రికార్డైంది.

నౌకలో భారతీయ సిబ్బంది..

MT జల్‌వీర్ వాణిజ్య నౌకలో అధిక సంఖ్యలో భారతీయ నావికులు సిబ్బందిగా ఉన్నట్లు రక్షణ వర్గాలు ధృవీకరించాయి. దాడి జరిగిన సమయంలో నౌకలో తీవ్ర కలకలం రేగినప్పటికీ, అదృష్టవశాత్తూ సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారని, అయితే నౌకకు కొంత మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో నౌకలపై వరుస దాడులకు తెగబడుతున్న హౌతీ రెబల్స్, ఇరాన్ సైన్యమే దాడికి పాల్పడి ఉండవచ్చని అమెరికా రక్షణ శాఖ అనుమానిస్తోంది.

Next Story