- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిప్యూటీ CM కాన్వాయ్‌పై దాడి.. తీవ్ర ఉద్రిక్తత
డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి.. తీవ్ర ఉద్రిక్తత

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Elections) తొలి విడత పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం విజయ్‌కుమార్ సిన్హా కాన్వాయ్‌పై దాడి జరిగింది. లక్షిసరాయ్ నియోజకవర్గం ఖోరియారి పోలింగ్ బూత్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, మొదటి విడతలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం మొత్తంగా 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడత పోలింగ్‌లో పలువురు కీలకనేతలు.. ఆర్జేడీ నేత, సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్. తేజ్ ప్రతాప్ యాదవ్, విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి వంటి ప్రముఖులు పోటీ చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మొత్తం 50,000లకి పైగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 1,000కి పైగా మహిళల కోసం పని చేసే ప్రత్యేక బూత్‌లు ఉన్నాయి. ఓటర్ ఐడీ కార్డ్ (ఈపీఐసీ)లేకపోతే.. ఆధార్, పాన్, పెన్షన్ కార్డ్, డ్రైవర్ లైసెన్స్ వంటి 11 పత్రాలు ఉపయోగించుకునే అవకాశం కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం.






