అమెరికాలో దాడి.. భారత విద్యార్ధి అరెస్ట్

by Muthe.Rajitha |

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన 22 ఏళ్ల విద్యార్థి మనోజ్ సాయి లెల్లను పోలీసులు అరెస్టు చేశారు.

అమెరికాలో దాడి.. భారత విద్యార్ధి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన 22 ఏళ్ల విద్యార్థి మనోజ్ సాయి లెల్లను పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ డల్లాస్ (UT Dallas)లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సీనియర్ స్టూడెంట్‌గా చదువుతున్న మనోజ్, కుటుంబ సభ్యులను బెదిరించడం మరియు ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలపై డిసెంబర్ 22, 2025న ఫ్రిస్కో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులు అతడికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఇంటిని తగలబెట్టే ప్రయత్నం చేశాడని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అతడిపై కుటుంబానికి టెర్రరిస్టిక్ థ్రెట్ చేసిన కేసు (క్లాస్ A మిస్డీమీనర్)తో పాటు ఆర్సన్ కేసు (ఫస్ట్ డిగ్రీ ఫెలనీ) నమోదు చేశారు, అయితే ఏ ఆరాధనా స్థలానికి సంబంధించి బెదిరింపులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఆర్సన్ కేసుకు $1 లక్ష, బెదిరింపుల కేసుకు $3,500 బాండ్ విధించారు. తెలుగు మూలాలు ఉన్న మనోజ్ ప్రస్తుతం కాలిన్ కౌంటీ జైలులో ఉండగా, ఈ ఘటన మానసిక ఆరోగ్య సమస్యలతో సంబంధం ఉండొచ్చని భావిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story