- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్ణాటకలో దారుణం: కన్న కూతురిని బావిలోకి నెట్టి, రాళ్లతో కొట్టి చంపిన తండ్రి
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఒక నెల క్రితం అదృశ్యమైన 17 ఏళ్ల బాలికను ఆమె కన్నతండ్రే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఒక నెల క్రితం అదృశ్యమైన 17 ఏళ్ల బాలికను ఆమె కన్నతండ్రే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. వివాహానికి సంబంధించిన వివాదాల కారణంగానే ఈ ఘాతుకం జరిగినట్లు పోలీసులు తెలిపారు. శిరా తాలూకాలోని నింబెమరదహళ్లి గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, నిర్మల దంపతుల కుమార్తె మేఘన(17). ఏప్రిల్ 16న రోజువారీ కూలి పని ముగించుకుని సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన తల్లి నిర్మలకు.. ఇంట్లో కూతురు కనిపించలేదని, ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చి కల్లంబెల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పెళ్లి విషయమై కుటుంబంలో గొడవలు
మేఘన పెళ్లి విషయమై ఆ కుటుంబంలో తరచుగా వాగ్వాదాలు జరిగేవని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. మేఘనకు 18 ఏళ్లు నిండిన తర్వాత నిర్మల తన బంధువుల అబ్బాయితో వివాహం జరిపించాలని ప్రణాళికలు చేసుకున్నట్లు, పెళ్లి కుమారుడి కుటుంబం ఇప్పటికే వివాహం కోసం చీరలు, మంగళసూత్రాన్ని కూడా కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, తన భార్య బంధువులకు ఇచ్చి వివాహం చేయడాన్ని తండ్రి తిమ్మరాయప్ప తీవ్రంగా వ్యతిరేకించాడని, ఈ విషయంపై గత నాలుగైదు నెలలుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని దర్యాప్తులో తేలింది.
హత్య తర్వాత మిస్సింగ్ డ్రామా
ఇలాంటి ఒక వాగ్వాదం జరిగిన మరుసటి రోజే మేఘన అదృశ్యమైందని, అదే సమయంలో తండ్రి కూడా కనిపించకుండా పోవడంతో తమకు అనుమానం వచ్చిందని పోలీసులు వివరించారు. పోలీసుల విచారణలో తిమ్మరాయప్ప తన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. అతడు ముందుగా మేఘనను బావిలోకి తోసేసి, ఆపై రాళ్లతో కొట్టి చంపాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి, ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో పాతిపెట్టినట్లు వారు పేర్కొన్నారు. ఈ దారుణానికి పాల్పడిన తర్వాత, ఎవరికీ తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఏమీ ఎరుగని వాడిలా భార్యతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంలో ఆమెకు సహాయపడినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు. హత్య జరిగిన నెల రోజుల తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. షిరా తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని ఆదివారం వెలికితీశారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం పరీక్ష నిర్వహించి, తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకున్నారు.






