Train Accident : కేరళలో దారుణం.. రైలు ఢీకొని నలుగురు కార్మికులు దుర్మరణం

by Muthe.Rajitha |

కేరళలో ఘోర రైలు ప్రమాదం(Train Accident) జరిగింది.

Train Accident : కేరళలో దారుణం.. రైలు ఢీకొని నలుగురు కార్మికులు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళలో ఘోర రైలు ప్రమాదం(Train Accident) జరిగింది. రైల్వే ట్రాక్ మీద చెత్త తొలగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కేరళ ఎక్స్‌ప్రెస్(Kerala Express) రైలు ఢీకొట్టడంతో కిందపడి నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం పాలక్కాడ్ జిల్లా షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో షోరనూర్ వంతెనపై గల రైల్వే ట్రాక్ మీద చెత్తను తొలగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు కార్మికులు ఘటనాస్థలంలోనే మృతిచెందగా... భరతపుజ నదిలో పడిపోయి మరణించారు. కార్మికులు రైలును చూడకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.

Next Story