- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరు ట్రాఫిక్ పై వ్యోమగామి శుభాంశు శుక్లా ఆసక్తికర వ్యాఖ్యలు
బెంగళూరు ట్రాఫిక్ పై వ్యోమగామి శుభాంశు శుక్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగుళూరులో జరిగిన టెక్ సదస్సులో శుభాంశు శుక్లా ప్రసందించారు. ఈ సందర్భంగా.. బెంగళూరు ట్రాఫిక్ కంటే అంతరిక్షంలోకి ప్రయాణించడం చాలా తేలిక అంటూ నవ్వుతూ చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరు ట్రాఫిక్ పై వ్యోమగామి శుభాంశు శుక్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగుళూరులో జరిగిన టెక్ సదస్సులో శుభాంశు శుక్లా ప్రసందించారు. ఈ సందర్భంగా.. బెంగళూరు ట్రాఫిక్ కంటే అంతరిక్షంలోకి ప్రయాణించడం చాలా తేలిక అంటూ నవ్వుతూ చెప్పారు. అంతేకాకుండా తాను షెడ్యూల్ చేసుకున్న ప్రసంగం కంటే ట్రాఫిక్ లో మూడు రెట్లు ఎక్కువ సమయం పట్టిందని అన్నారు. కాబట్టి స్పీచ్ ఇచ్చేందుకు తనకు ఉన్న నిబద్దతను గుర్తించాలని చెప్పారు.
ఇక శుక్లా ప్రసంగం తరవాత మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. శుక్లా అంతరిక్షం నుండి బెంగుళూరు రావడం సులభం అని, కానీ మారతహల్లి నుండి ఈ వేధికకు చేరుకోవడం కష్టం అంటున్నారు.. భవిష్యత్ లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే శుక్లా సరదాగా చెప్పినప్పటకీ ఆయన ట్రాఫిక్ లో ఇబ్బంది పడినట్టు అర్థం అయ్యింది. గతంలోనూ బెంగుళూరు ట్రాఫిక్ వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు వ్యోమగామి సైతం ట్రాఫిక్ గురించి మాట్లాడటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది.






