- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kim Jong-un: కిమ్ మామనా మజాకా.. పుతిన్ తో భేటీ తర్వాత కిమ్ డిఎన్ఏ ఆనవాళ్లు రిమూవ్ (వీడియో)
చైనా పర్యటనలో ఉన్న కిమ్ సహాయకులు చేసిన పని ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ఏది చేసినా సంచలనమే. స్వదేశంలో ఆయన తీసుకునే నిర్ణయాలైనా.. విదేశాల్లో ఆయన పర్యటనలోనైనా ఆయన ప్రతి కదలికపై నెటిజన్లు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా కిమ్ జోంగ్ చైనా (China) పర్యటన వైరల్ గా మారింది. చాలా అరుదుగా తన దేశం దాటి బయటకు వచ్చే కిమ్ జోంగ్ గత మంగళవారం చైనాలో అడుగుపెట్టారు. చైనా నిర్వహించే సైనిక కవాతులో ఆయన పాల్గొనేందుకు ఏకంగా బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్ వచ్చారు. 2023 తర్వాత నార్త్ కోరియాను దాటి రావడం ఇదే తొలిసారి కావడంతో అందరి ఫోకస్ ఈ టూర్ పై పడింది.
డీఎన్ ఏ తుడిచేసిన సహాయకులు:
ఈ పర్యటన సందర్భంగా కిమ్ సహాయకులు చేసిన పని అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టింది. చైనాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) తో కిమ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం కిమ్ సహాయకులు ఆయన కూర్చున్న కుర్చీని ఓ క్లాత్ తో తుడిచివేయగా మరొకరు ఆయన వాడిన గ్లాస్ లను తమ వెంటే తీసుకెళ్లారు. ఈ పరిణామం అందరిని ఆశ్చర్యంలోకి నెట్టింది. అయితే కిమ్ డీఎన్ఏ విదేశీ గూఢ చారులకు, ఇతరులకు చిక్కకూడదనే కిమ్ సిబ్బంది ఈ జాగ్రత్తలు పాటించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సిగరేట్ పీక కాదు దాని బూడిద కూడ వదలరు:
నియంతగా పేరున్న కిమ్ విదేశాలకు వెళ్లిన ప్రతిసారి అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తారు అనే టాక్ ఉంది. తనపై ఏ రకంగానైనా దాడి జరగవచ్చనే అనుమానంతో ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రతిది ఆయన అనుచరులు క్షణ్ణంగా పరిశీలించడంతో పాటు ఆయనకు చెందిన ఏ వస్తువైనా విదేశాల్లో వదిలిపెట్టకుండా తమ వెంటే తీసుకువెళ్తారట. తాగి పారేసిన సిగరేట్ పీకలే కాదు చివరకు ఆ సిగరేట్ బూడిద దాన్ని వెలిగించుకునేందుకు ఉపోయగించిన అగ్గిపుల్లను కూడా వదిలిపెట్టరని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. చైనా పర్యటనలో కిమ్ మల వ్యర్థాలను సైతం అక్కడ వదిలివేయకుండా తమ స్వదేశానికి వెంట తీసుకుని వెళ్లేలా అంతా సేకరిస్తున్నారు. కిమ్ సిబ్బంది ఇలా చేయడం ఇదేం కొత్త కాదు. కాకపోతే ఈసారి మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తన మలం ఇతరు చేతికి చిక్కితే తన అనారోగ్య సమస్యలు బహిర్గతం అయ్యే అవకాశం ఉండటంతో ఎక్కడికి వెళ్లినా ఆయన సొంత టాయిలెట్ తన వెంటే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారట. 2018 లో ఉత్తర-దక్షిణ శిఖరాగ్ర సమావేశానికి, 2019లో అమెరికా-ఉత్తర కొరియా శిఖరాగ్ర సమావేశం కోసం హనోయ్‌కు, 2022లో అమెరికా-ఉత్తర కొరియా శిఖరాగ్ర సమావేశానికి సింగపూర్‌కు వెళ్లిన సందర్భంలోనూ కిమ్ తన సొంత టాయిలెట్ ను వెంట తీసుకుపోయారు. ఇక విదేశీ పర్యటనలో ఉండగా అధికార పత్రాలు, ఒప్పందాల సమయంలో సంతకాలు చేయడానికి కిమ్ ఇతరులు ఇచ్చే పెన్ కూడా ఉపయోగించరని తన వేలి ముద్రలు ఆతిథ్య దేశ గూఢచారులు, అధికారులకు చేరుకుండా తన సొంత పెన్నులను మాత్రమే ఉపయోగిస్తారు.
గత నెలలో పుతిన్ సైతం సేమ్ టు సేమ్:
గత నెలలో అలాస్కాలో పర్యటించిన రష్య అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్కడ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్ వెంట అతడి అంగరక్షకుల్లో ఒకరు నల్ల రంగు సూట్ కేస్ పట్టుకు తిరగడం అందరి దృష్టిని ఆకర్షిచింది. పుతిన్ మల వ్యర్ధాలను సేకరించి ఆ సూట్ కేసులో ఉంచి తిరిగి తమ స్వదేశానికి తీసుకువెళ్తారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. పుతిన్ ఎప్పుడు విదేశాల్లో పర్యటించినా ఇలాగే చేస్తారని గతంలోనూ కథనాలు వచ్చాయి.






