- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రిపురలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
by Sathputhe Rajesh |
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 3,337 పోలింగ్ కేంద్రాల్లో 60 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుండగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కోసం ఉద్యమం చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తిప్రా మోతా రాకతో ఈ సారి త్రిముఖ పోరు నెలకొంది. బీజేపీ - ఐటీఎఫ్ టీ కూటమి, సీపీఐ(ఎం)- కాంగ్రెస్ కూటమి, తిప్రా మోతాల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. మొత్తం 28.13 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మార్చి రెండో తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
Next Story






