- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు.. నీలంబూర్ UDFదే, రెండు చోట్ల ఆధిక్యంలో ఆప్
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఈనెల 19న జరిగిన ఉప ఎన్నికలకు నేడు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఈనెల 19న జరిగిన ఉప ఎన్నికలకు నేడు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కేరళ (Kerala)లోని నీలంబర్, పంజాబ్ (Punjab)లోని లూథియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని కాలిగంజ్, గుజరాత్ (Gujrat)లోని విశావదర్, కాడి నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. అందులో మూడు స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. కేరళ రాష్ట్రం నీలంబూర్ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని UDF అభ్యర్థి ఆర్యదన్ షౌకత్, CPI(M) అభ్యర్థి ఎం.స్వరాజ్‌ను 11,077 ఓట్ల తేడాతో ఓడించి విజయం సాధించారు. అయితే, ఇది సీఎం పినరాయి విజయన్ నేతృత్వంలోని LDF ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. దివంగత కాంగ్రెస్ నాయకుడు ఆర్యదన్ ముహమ్మద్ కుమారుడైన షౌకత్, అసంతృప్తి, మైనారిటీ మద్దతుతో గెలుపొందారు. CPI(M) మద్దతు గల స్వతంత్ర శాసనసభ్యుడు పి.వి.అన్వర్ రాజీనామాతో ఈ ఉప ఎన్నిక జరిగింది.
ఇక పంజాబ్ రాష్ట్రంలోని లూధియానా వెస్ట్ నియోజవర్గంలో నుంచి AAP అభ్యర్థి సంజీవ్ అరోరా, కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ ఆశును 4,751 ఓట్ల తేడాతో ఓడించి ఉప ఎన్నికలో విజయం సాధించారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ట్రెండ్స్ ప్రకారం.. మొదటి రౌండ్‌లో 1,269 ఓట్లు, ఆరో రౌండ్‌లో 2,286 ఓట్లు, తర్వాత 4,748 ఓట్ల ఆధిక్యత సాధించారు. BJP జీవన్ గుప్తా మూడవ స్థానంలో, షిరోమణి అకాలీ దళ్ అభ్యర్థి పరుప్కార్ సింగ్ ఘుమ్మన్ నాలుగో స్థానంలో నిలిచారు. AAP MLA గుర్‌ప్రీత్ బస్సీ గోగి మరణంతో ఈ ఉప ఎన్నిక జరిగింది.
అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలోని విసావదర్ నియోజవర్గంలో AAP అభ్యర్థి గోపాల్ ఇటాలియా, BJP అభ్యర్థి కిరీట్ పటేల్‌పై 17 రౌండ్ల లెక్కింపు తర్వాత 14,404 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.. గతంలో AAP గుజరాత్ అధ్యక్షుడైన ఇటాలియా, రెండవ రౌండ్‌లో 391 ఓట్లు, మొదటి రౌండ్లలో 5,500 ఓట్లు, 12వ రౌండ్‌లో 7,232 ఓట్ల ఆధిక్యత సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి నీతిన్ రన్‌పరియా పూర్తిగా వెనుకబడ్డారు. AAP ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ రాజీనామా చేసి BJPలో చేరడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.






