- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Assam: అసోంలో భారీ వర్షాలు.. ఐదుగురు మృతి
అసోంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం స్థంబించిపోయింది.

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం స్థంబించిపోయింది. కామరూప్ జిల్లాలో గత 24 గంటల్లో కొండచరియలు విరిగిపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. అంతేగా క గువహటి (Guwahati), సిల్చార్ (Silchar) సిటీల్లో మరో పది వేల మంది ప్రజలు వరదల వల్ల ప్రభావితమైనట్టు వెల్లడించింది. గువహటిలోని అనేక ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పట్టణ వ్యవహారాల మంత్రి జయంత మల్లా బారువా ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్టు తెలిపారు. రెండు సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
గువహటి, దాని పరిసర ప్రాంతాల్లో 90 నుంచి 134 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, భవిష్యత్తులో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అప్రమత్తమైన ప్రభుత్వం రెండు జిల్లాలో విద్యా సంస్థలను మూసి వేసింది. అంతకుముందు కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా గువహటి ఎయిర్ పోర్టులో విమాన సేవలకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. కాగా, అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి.






