Assam: అసోం కేబినెట్ విస్తరణ.. నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రులుగా చాన్స్

by B.Srinivas |

అసోం సీఎం హిమంత బిస్వశర్మ తన కేబినెట్‌ను విస్తరించారు. నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి మండలిలో స్థానం కల్పించారు.

Assam: అసోం కేబినెట్ విస్తరణ.. నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రులుగా చాన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోం సీఎం హిమంత బిస్వశర్మ (Himanth biswa sharma) తన కేబినెట్‌ను విస్తరించారు. నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి మండలిలో స్థానం కల్పించారు. వారిలో ప్రశాంత ఫూకాన్ (Pradshantha Fukaan), కౌశిక్ రాయ్ (Koushik ray), కృష్ణేందు పాల్ (Krishnendhu paul), రూపేష్ గోలా (Rupesh Gola)లు ఉన్నారు. వీరంతా బీజేపీకి చెందిన శాసనసభ్యులే. కొత్తగా నియామకమైన మంత్రులతో అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య (Lakshman Prasad Acharya) శనివారం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం బిస్వశర్మతో పాటు ఇతర మంత్రి వర్గ సభ్యులు పాల్గొన్నారు. ఫూకాన్ దిబ్రూగఢ్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా, కృష్ణేందు పథర్‌కండి నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక, రాయ్, రూపేశ్‌లు గత అసెంబ్లీ ఎన్నికల్లోనే మొదటి సారి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరి చేరికతో మంత్రి మండలి సభ్యుల సంఖ్య 19కి చేరుకుంది. ఇందులో యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ నుంచి ఒకరు, అసోమ్ గణ పరిషత్ (AGP) నుంచి ఇద్దరు ఉన్నారు.

Next Story