- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సయ్యదా హమీద్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన అస్సాం సీఎం
బంగ్లాదేశ్, పాకిస్తాన్ ముస్లింలను భారత్ లోకి అనుమతివ్వాలని సయ్యదా హమీద్ చేసిన వ్యాఖ్యలపై అస్సాం సీఎం స్పందిస్తూ ఫైర్ అయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యురాలు సయ్యదా హమీద్ (Syeda Hamid) చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శులు వస్తున్నాయి. ఆమె ఈ రోజు ఉదయం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ముస్లింల (Bangladeshi Muslims)ను భారతదేశంలోకి అనుమతించడంలో ఏ తప్పు లేదని వారు కూడా మనుషులేనని, మనవతా దృక్పదంలో వారిని భారత్‌లో నివసించేందుకు సహకరించాలని ఆమో మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆమో వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (CM Himanta Biswa Sarma) ఫైర్ అయ్యాడు. ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ తన ట్వీట్‌లో.. "గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన సయ్యదా హమీద్ వంటి వ్యక్తులు అక్రమ చొరబాటుదారులను చట్టబద్ధం చేస్తున్నారు.
వారు అస్సాంను పాకిస్తాన్ (Pakistan)లో భాగం చేయాలనే జిన్నా కలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె లాంటి వ్యక్తుల నిశ్శబ్ద మద్దతు కారణంగా నేడు అస్సామీ గుర్తింపు అంతరించిపోయే అంచున ఉంది. కానీ మేము లచిత్ బర్ఫుకాన్ కుమారులు, కుమార్తెలు, మా రాష్ట్రాన్ని, మా గుర్తింపును కాపాడుకోవడానికి మా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతాము. నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, బంగ్లాదేశీయులు అస్సాంలో స్వాగతించబడరు. ఇది వారి భూమి కాదు. వారితో సానుభూతి చూపే ఎవరైనా వారితో వెళ్లిపోవచ్చు. అస్సాం అక్రమ చొరబాటుదారుల ఆక్రమణలకు సిద్ధంగా లేదు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ సిద్ధంగా ఉండదు అంటూ అస్సాం సీఎం ఫైర్ అవుతు రాసుకొచ్చాడు.






