- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ వేగంగా, కఠినంగా స్పందిస్తుంది.. భారత్‌కు మునీర్ వార్నింగ్
by Phanindra |
పాకిస్తాన్ తొలి సీడీఎఫ్‌గా ఆసిమ్ మునీర్ నియమితుడయ్యాడు. మొదటి ప్రసంగంలో కూడా తాము వేగంగా, కఠినంగా స్పందిస్తామంటూ భారత్‌కు వార్నింగ్ ఇచ్చాడు.

X
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ త్రివిధ దళాధిపతిగా నియమితుడైన తర్వాత తన తొలి ప్రసంగంలో భారత్‌కు హెచ్చరికలు చేశారు ఆసిమ్ మునీర్. పాక్ చరిత్రలో తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (సీడీఎఫ్)గా నియమితుడైన ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్.. భారత్ తమపై ఎలాంటి దాడి చేసినా తమ ప్రతిచర్య చాలా తీవ్రంగా, వేగంగా ఉంటుందని హెచ్చరించారు. ‘పాక్ చాలా కఠినంగా స్పందిస్తుంది. కాబట్టి భారత్ ఎలాంటి ఊహల్లో ఉండకపోతే మంచిది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా పాక్‌లో డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ ఏర్పాటు చేయడం చారిత్రాత్మక విషమయన్న ఆయన.. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసి ఏకీకృత చర్యలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
Next Story






