Asif: ఔరంగజేబు పాలనలోనే భారత్ ఐక్యంగా ఉంది.. పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్

by B.Srinivas |

పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు.

Asif: ఔరంగజేబు పాలనలోనే భారత్ ఐక్యంగా ఉంది.. పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Kawaja asif) మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలున్నాయని, భవిష్యత్‌లో ఏదైనా ఘర్షణ జరిగితే పాకిస్థాన్ మరింత గొప్ప విజయాన్ని సాధిస్తుందని తెలిపారు. తాజాగా ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఇండియాతో యుద్ధం జరిగే చాన్స్ వాస్తవమేనని, పాక్ పరిస్థితిని నిరంతరం గమనిస్తోందని తెలిపారు. ఉద్రిక్తతలను పెంచాలని కోరుకోవడం లేదని, కానీ గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని పాక్ సాధిస్తుందని చెప్పారు. మొగల్ చక్రవర్తి ఔరంగ జేబు పాలనతో తప్ప భారత్ ఎప్పుడూ ఐక్యంగా లేదని తెలిపారు. చరిత్రను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. పాక్ అల్లా పేరుతో సృష్టించబడిందని స్వదేశంలో విభిన్న వాదనలున్నా భారత్‌తో పోరాటంలో ఐక్యంగా ఉంటామన్నారు. పాక్‌కు గతంలో కంటే ప్రస్తుతం ఎక్కువ మద్దతు దారులు, మిత్రదేశాలు ఉన్నాయన్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ పలు దేశాల మద్దతు కోల్పోయిందని చెప్పారు. కాగా, ఆసిఫ్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Next Story