- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TIK TOK: ఇండియాలో టిక్ టాక్ రీఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి
తాజాగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో భారత్ లో తిరిగి టిక్ టాక్‌కు అనుమతిస్తున్నారా అంటూ ప్రశ్నించగా..తమకు టిక్ టాక్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారత్ చైనా మధ్య మళ్లీ సంబంధాలు బలపడుతున్న సంగతి తెలిసిందే. అమెరికాతో దూరం పెరిగిన తరవాత భారత్ చైనాకు దగ్గరవుతోంది. మరోవైపు వొడాఫోన్, ఎయిర్‌టెల్ లాంటి నెట్‌వర్క్స్ టిక్ టాక్‌కు యాక్సెస్ ఇచ్చాయి . ఈ క్రమంలో ఇండియాలో బ్యాన్ చేసిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్‌కు తిరిగి అనుమతించబోతున్నారంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో భారత్ లో తిరిగి టిక్ టాక్‌కు అనుమతిస్తున్నారా అంటూ ప్రశ్నించగా..తమకు టిక్ టాక్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు.
దీంతో టిక్ టాక్ రీ ఎంట్రీ వార్తలకు ఆయన చెక్ పెట్టారు. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం జూన్ 2020లో 59 చైనీస్ యాప్స్‌ను బ్యాన్ చేసింది. అప్పటికే ఇండియాలో టిక్ టాక్ యూజర్లు 200 మిలియన్లకు పైగా ఉన్నారు. దీంతో పాటు అప్పుడప్పుడే పాపులర్ అవుతున్నా హలో యాప్‌ను కూడా బ్యాన్ చేసింది. చైనీస్ యాప్స్ కీలక సమాచారాన్ని దోచుకుంటున్నాయని,స్వీయ భద్రతకు ముప్పు వాటిళ్లే ప్రమాదం ఉందనే ఉద్దేశ్యంతోనే భారత్ చైనీస్ యాప్‌లను బ్యాన్ చేసింది. తరవాత ప్లే స్టోర్ నుండి సైతం వీటిని తొలగించారు. ఇక కేంద్ర మంత్రి తాజాగా ఇచ్చిన ప్రకటనతో టిక్ టాక్ ఇండియాలోకి రావడం కష్టమే అని అర్థం అవుతోంది.






