Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై అనుచిత వ్యాఖ్యలు.. ప్రొఫెసర్ అరెస్ట్

by Shamantha N |

ఆపరేషన్ సిందూర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేసిన ప్రొఫెసర్ ను పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా సోనిపట్ లోని అశోక యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై అనుచిత వ్యాఖ్యలు.. ప్రొఫెసర్ అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేసిన ప్రొఫెసర్ ను పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా సోనిపట్ లోని అశోక యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బీజేపీ యువ మోర్చా నేత ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. "అలీ ఖాన్ మహ్మదాబాద్‌ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ACP) అజీత్ సింగ్ ఫోన్‌లో తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌తో సంబంధం ఉన్న కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి ఆయనను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని అశోక యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. కేసు వివరాలను నిర్ధారించే ప్రక్రియలో ఉన్నట్లు పేర్కొంది. పోలీసులకు పూర్తి సహకారమందిస్తామని వెల్లడించింది. కాగా.. ఆపరేషన్ సిందూర్ పై ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలపై హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ అసోసియేట్ ఆయనకు నోటీసులు పంపింది. నోటీసులు పంపిన కొన్ని రోజుల తర్వాత ఈ అరెస్టు జరిగింది.

Next Story