నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా అశోక్ లాహిరి.. కొత్త సభ్యుల నియామకం!

by Malleboina Mahesh |

నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ: కొత్త వైస్ ఛైర్మన్‌గా అశోక్ కుమార్ లాహిరి నియామకం. 5గురు కొత్త సభ్యులతో 'వికసిత్ భారత్' దిశగా అడుగులు.

నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా అశోక్ లాహిరి.. కొత్త సభ్యుల నియామకం!
X

దిశ, వెబ్ డెస్క్: భారత విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న నీతి ఆయోగ్‌ (NITI Aayog)ను ప్రభుత్వం భారీ మార్పులతో పునర్వ్యవస్థీకరించింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఈ సంస్థకు కొత్త వైస్ ఛైర్మన్‌ (New Vice Chairman)గా ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) అశోక్ కుమార్ లాహిరి (Ashok Kumar Lahiri) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. సుమన్ బెరీ స్థానంలో బాధ్యతలు చేపట్టిన లాహిరి శనివారం (ఏప్రిల్ 25, 2026) ప్రధాని మోడీ (Prime Minister Modi)తో సమావేశమై తన పదవీకాలాన్ని ప్రారంభించారు. ఆర్థిక రంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న లాహిరి రాకతో దేశ ఆర్థిక వ్యూహాలకు మరింత పదును పెరగనుంది.

ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఐదుగురు కొత్త పూర్తిస్థాయి సభ్యులను (Five new full members) కూడా ప్రభుత్వం నియమించింది. మాజీ కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, వ్యవసాయ నిపుణులు ప్రొఫెసర్ కె.వి. రాజు, ప్రముఖ ఇమ్యునాలజిస్ట్ ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరందీకర్, ఎయిమ్స్ (AIIMS) ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ పూర్తిస్థాయి సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. 'సహకార సమాఖ్య' స్ఫూర్తిని బలోపేతం చేస్తూ, 'వికసిత్ భారత్ 2047' లక్ష్యం దిశగా వినూత్న సంస్కరణలు మరియు దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించడంలో ఈ కొత్త బృందం కీలక పాత్ర పోషించనుంది.

Next Story