బీజేపీకి దమ్ముంటే, ట్రంప్ వాదన అబద్ధమని చెప్పాలి.. మోడీపై ఓవైసీ ఫైర్

by Ajay Maddhiboyina |

ప్ర‌ధాని మోడీపై ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ విమ‌ర్శ‌లు కురిపించారు. ర‌ష్యా చ‌మురు కొనుగోళ్ల‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ మోడీపై మండిప‌డ్డారు.

బీజేపీకి దమ్ముంటే, ట్రంప్ వాదన అబద్ధమని చెప్పాలి.. మోడీపై ఓవైసీ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ప్ర‌ధాని మోడీపై ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ విమ‌ర్శ‌లు కురిపించారు. ర‌ష్యా చ‌మురు కొనుగోళ్ల‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ మోడీపై మండిప‌డ్డారు. మీరు ట్రంప్ ను సంతోష‌పెట్టి భార‌త్ ను అసంతృప్తికి గురి చేస్తున్నారా అని ప్ర‌శ్నించారు. ఈ విష‌యాన్ని ట్రంప్ యే చెప్పాడ‌ని కావాలంటే వీడియో చూడాల‌ని అన్నారు. బీజేపీకి ద‌మ్ముంటే ట్రంప్ వాద‌న అబద్ధం అని చెప్పాల‌న్నారు. ర‌ష్యా నుండి చ‌మురు దిగుమ‌తులు చేస్తే అమెరికా భార‌త్ పై అధిక సుంకాలు విధించే అవ‌కాశం ఉంద‌న్నారు.

మోడీ మరోసారి ట్రంప్ సర్కార్ అన్నాడని ట్రంప్ ఎప్పుడు వచ్చాడో అప్పటి నుండి భారతీయలను ఇబ్బంది పెడుతున్నాడని అన్నారు. ఇదిలా ఉంటే రష్యా నుండి భారత్ చమురు దిగుమతులను నిలిపివేయాలని హెచ్చరించిన సంగతి తెలిసిందే. మోడీ చాలా మంచి వ్యక్తి అని కానీ తనను కూడా సంతోషపెట్టాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. లేదంటే భారత్ పై సుంకాలు మరింత పెంచుతామని హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story