అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూ ఎఫెక్ట్.. భారత్‌లో గ్లోబల్ టైమ్స్ పత్రిక ‘X’ ఖాతాపై నిషేధం

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-14 06:34:23  IST  )

అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal Pradesh) పరిధిలోని పలు ప్రాంతాల పేర్లను చైనా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై భారత ప్రభుత్వం ఓ రేంజ్‌లో సీరియస్ అయింది.

అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూ ఎఫెక్ట్.. భారత్‌లో గ్లోబల్ టైమ్స్ పత్రిక ‘X’ ఖాతాపై నిషేధం
X

దిశ, వెబ్‌డెస్క్: అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal Pradesh) పరిధిలోని పలు ప్రాంతాల పేర్లను చైనా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై భారత ప్రభుత్వం ఓ రేంజ్‌లో సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అతర్భాగం కాదని చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ కేంద్రం విపరీతంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. ఇదే విషయంలో సదరు పత్రిక ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేలా పని చేస్తోంది. దీంతో తాజాగా ఇండియాలో గ్లోబల్ టైమ్స్ పత్రిక ‘X’ (ట్విట్టర్) ఖాతాపై నిషేధం విధిస్తూ మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం..

అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమని భారత దౌత్యవేత్త రణ్‌ధీర్‌ జైస్వాల్‌ అన్నారు. భారత్‌లోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలు చేస్తుండటం తాము గమనిస్తూనే ఉన్నామని తెలిపారు. చైనా ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు, చరిత్ను మార్చలేరని రణ్‌ధీర్‌ జైస్వాల్‌ ఫైర్ అయ్యారు.

Next Story